రాహుల్ ముందు రేవంత్ ఉంచిన డిమాండ్స్ ఇవే     2017-10-18   05:38:33  IST  Bhanu C

Revanth Reddy Demands to Join Congress

ఒక పార్టీలో నుంచీ మరొక పార్టీలోకి ఎవరన్నా వెళ్తున్నారు అంటే…ఆపార్టీ మీద ప్రేమతోనో ఇక్కడ చేయలేని పనులు అక్కడ ఎదో చేసేద్దామని కాదు…వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కానీ..టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి ముందునుంచీ వాళ్ళు వేసే ఎత్తుగడలు..వాళ్ళు పార్టీ మారే సమయంలో చెప్పే కోరికల లిస్టుకి బెంబేలెత్తి పోతున్నారట ఆ పార్టీ నేతలు..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే నమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.

వైసీపి నుంచీ ఎంపీ గా ఎన్నికైన బుట్టా రేణుక ..టిడిపిలోకి జంప్ చేయడానికి ఆమె టిడిపి ముందు ఉంచిన కోరికల చిట్టా వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీ సీటు, ప్ర‌చార ఖ‌ర్చు కింద 100 కోట్లు(అయితే, 70 ఇచ్చేందుకు బాబు ఓకే అన్నార‌ని స‌మాచారం) ఇవ్వాల‌ని ఆమె ప్ర‌థ‌మ డిమాండ్‌గా పెట్టార‌ట‌.ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ప‌నుల‌కు 300 కోట్లు, కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాల‌ని బుట్టా త‌న చిట్టాను బాబుగారికి అందించారు అని టాక్ నడుస్తోంది…మరి వైసీపి ని సరైన సమయంలో దెబ్బకొట్టి ప్రజలలోవైసీపి క్రేజ్ తగ్గించాలంటే ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా మరి అనుకుంటున్నారు నేతలు..