రేణు దేశాయ్‌ రెండవ పెళ్లి.. వరుడు ఇతడేనా?     2018-06-17   23:07:33  IST  Raghu V

చిన్న వయస్సులోనే పవన్‌ కళ్యాణ్‌ను ప్రేమించిన రేణుదేశాయ్‌, ఎవరు చేయని సాహసం చేసింది. పవన్‌పై విపరీతమైన ప్రేమతో ఆయనతో సహజీవనం సాగింది. పవన్‌ కళ్యాణ్‌తో ఒక సినిమా సమయంలో పరిచయం అయిన రేణుదేశాయ్‌ అప్పటి నుండి కూడా ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌కు వివాహం ఇష్టం లేకపోయినా కూడా సహజీవనం సాగించేందుకు కూడా రెడీ అంటూ ముందుకు వచ్చింది. పవన్‌తో సుదీర్ఘ కాలం సహజీవనం సాగించిన రేణుదేశాయ్‌ జీవితం చాలా విభిన్నం అని చెప్పుకోవచ్చు. ఏ మహిళ కూడా ఇంత బాహాటంగా సహజీవనం సాగించిన దాఖలాలు లేవు. అది కూడా ఒక స్టార్‌ హీరోతో.

రాజకీయ కారణాల వల్ల సహజీవనానికి స్వస్థి పలికి కొడుకు పుట్టిన తర్వాత రేణుదేశాయ్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అప్పట్లో సంచనం అని చెప్పుకోవచ్చు. పవన్‌, రేణుల వివాహం తర్వాత పాప జన్మించింది. వీరి జీవితం హాయిగా, సాఫీగా సాగిపోతున్న సమయంలో ఏం జరిగిందో ఏంటో కాని, ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో పవన్‌ నుండి భారీ మొత్తంలో భరణంను తీసుకుంది అంటూ రేణుదేశాయ్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ఇక అప్పటి నుండి పవన్‌కు దూరంగా తన సొంత ప్రాంతం అయిన పూణెలో ఉంటున్న రేణుదేశాయ్‌ పిల్లలతో కాలంను గడిపేస్తోంది.