పిల్లల కోసం టచ్‌లోనే ఉంటాం అంటున్న రేణుదేశాయ్     2018-06-28   06:05:58  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండవ వివాహంకు సిద్దం అయిన విషయం తెల్సిందే. తాజాగా పూణెకు చెందిన ఒక వ్యక్తితో ఈమె వివాహ నిశ్చితార్థం అయ్యింది. పవన్‌తో విడాకులు అయినప్పటి నుండి కూడా ఆయన గురించి ఎప్పుడు కూడా బాహాటంగా రేణుదేశాయ్‌ విమర్శించిన దాఖలాలు లేవు. పవన్‌ కూడా రేణుదేశాయ్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం జరగలేదు. ఇద్దరు కూడా పిల్లల కోసం స్నేహంగా ఉంటూనే వస్తున్నారు. ఇద్దరు పిల్లల కోసం వీరిద్దరు స్నేహంగా ఉంటూ, వారిని సంతోషంగా ఉంటున్నారు. రేణుదేశాయ్‌ తన పెళ్లి తర్వాత కూడా పవన్‌తో అదే స్నేహంను కొనసాగించాని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ పెళ్లి తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో సంబంధాలు పూర్తిగా తెగి పోనున్నాయా అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మా ఇద్దరికి పిల్లలు ఉన్నారు. వారి కోసం ఇన్నాళ్లుగా స్నేహంను కొనసాగిస్తూ వస్తున్నాం. వారిద్దరి సంతోషం కోసం మేమిద్దరం ఎప్పటికి స్నేహితులుగా ఉండి, వారి అవసరాలను తీర్చుతాం, ఇద్దరికి సంబంధించిన కీలక విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయించుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. పిల్లలకు తల్లి దండ్రి ఇద్దరు సమానంగా అవసరం అని, అలా ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లలు సంతోషంగా ఉంటారు.