హాస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంటే ఈ జాగ్రత్తలు పాటించండి

హస్తప్రయోగం చాలా మంచి అలవాటు. ఈ జెనరేషన్ కానివాళ్ళకి నచ్చకపోవచ్చు, మతపెద్దలు అసహ్యించుకోవచ్చు కాని, సైన్స్ గురించి నాలుగు ముక్కలు తెలిసినా హస్తప్రయోగం ఎంత ఉపయోగకరమైన అలవాటు మీకు అర్థం అవుతుంది. హస్తప్రయోగం వలన ఆక్సిటాసిన్ విడుదల అవుతుంది, మనసుకి ప్రశాంతత లభిస్తుంది, ఒంటికి నిద్ర లభిస్తుంది, లిబిడో పెరుగుతుంది, ఆరోగ్యకరమైన వీర్య ఉత్పత్తి జరుగుతుంది, పీరియడ్స్ లో నొప్పులు తగ్గుతాయి, కాలరీలు ఖర్చవుతాయి, సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది .. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టు రాయాలి.

ఇన్ని లాభాలున్నాయి కాబట్టి హస్తప్రయోగం మంచిదే. హస్తప్రయోగం వలన శరీరానికి ఎలాంటి హాని కలగకపోవచ్చు, కాని హాస్తప్రయోగం చేసుకునే పద్ధతుల వలన మనమే మన శరీరాన్ని బాధపెట్టవచ్చు. హస్తప్రయోగం కూడా ఓ కళే. దాన్ని ఎలా చేయాలో, అలానే చేయాలి, లేదంటే ప్రమాదాలు తప్పవు. భావప్రాప్తి పొందడానికి హస్తప్రయోగం మంచి మార్గం .. కాని హస్తప్రయోగం చేసుకోవడానికి ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి .. అవేంటో చూడండి.

1) అమ్మాయిలు .. రిస్క్ వద్దు

అమ్మాయిలు సాధ్యమైనంత వరకు సెక్స్ టాయ్స్ వాడకపోవడమే మంచిది. హానికరమైన ప్లాస్టిక్ తో తయారయ్యే సెక్స్ టాయ్స్ యోని లోపలి చర్మంపై తన ప్రభావం చూపించవచ్చు. సరిగా మెయింటేన్ చేయని సెక్స్ టాయ్స్ తో ఇంఫెక్షన్స్ కి గురయినా అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. లూబ్రికేషన్ కోసం అమ్మాయిలు రకరకాల లూబ్రికెంట్స్ వాడతారు. వీటిలో కూడా కెమికల్స్‌ కలిసి ఉంటాయి. కాబట్టి నేచురల్ గా లూబ్రికేట్ అయ్యేంత ప్రేరణ దొరికితే, లేదా ఆంతలా కామోద్రేకం పొందితే, ఇలాంటి సమయాల్లో మార్కేట్లో దొరికే లూబ్రికేంట్స్ అవసరం ఉండవు కాబట్టి, ఆ హాస్తప్రయోగం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. కాని ఫోర్స్డ్ గా లూబ్రికేషన్ కోసం బయటి లూబ్రికేషన్ వస్తువులు యోనిమీద ప్రయోగించడం కొంచెం రిస్కీ వ్యవహారమే.

ఇక స్త్రీలు హస్తప్రయోగం కోసం తమ చేతులని ఉపయోగిస్తేనే మంచిదని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు. రకరకాల ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి థ్రిల్ కోసం లేనిపోని వస్తువులు వాడకూడదు. చేతివేళ్ళతో చేసుకునే హస్తప్రయోగమే సేఫ్ .. కాని చేతులు శుభ్రపరుచుకోనే పని మొదలుపెట్టాలి. ఎందుకంటే ఎప్పుడూ మీ చేతుల్లో బ్యాక్టీరియా ఉంటూనే ఉంటుంది.