మొబైల్ నీటిలో పడితే ఆ తర్వాత తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు

వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొంటున్నాం. ఒక్క తప్పు చేస్తే, ఒక్క సెకను అజాగ్రత్తగా ఉంటే మన అత్యవసర వస్తువు స్మార్ట్ ఫోన్ ని నీటిలో పోసిన వాళ్ళమవుతాం. ఫోన్ నేల మీద బలంగా పడినా, ఏదో మూల ఆశ ఉంటుంది, ఆ ఫోన్ బతికే ఉంటుందేమో అని, చాలాసార్లు ఫోన్ కి ఏమి జరగదు కూడా. కాని నీటిలో పడితేనే పెద్ద ప్రమాదం. నేల మీద పడితే పెద్దగా నష్టం వాటిల్లకుండా గొరిల్లా గ్లాసులు, మెటల్ డిజైన్లు ఇస్తున్నారు కాని నీటి నుంచి కాపాడటం కష్టమే కదా. ఎందుకంటే మొబైల్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం.

ఫోన్ నీటిలో పడితే, చాలామంది చేసే పొరపాటు అది పనిచేస్తుందో లేదో అప్పటికప్పుడు చెక్ చేయాలనుకోని ఆన్ చేయడం. అది చాలా తప్పు. మరి ఏం చేయాలి?

* ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొబైల్ బయటకు తీయండి. ఒక వేళ మొబైల్ అప్పటికి ఆన్ లో ఉండే వెంటనే ఆఫ్ చేయండి. ఆఫ్ అయిపోయి ఉంటే ఆన్ చేయవద్దు.

* మొబైల్ నుంచి సిమ్ కార్డుని, బ్యాటరీని వేరు చేయండి. ఎంతవరకైతే మొబైల్ని విప్పగలరో అంతవరకూ విడదీయండి.