కుజ దోష నివారణకు ఏమి చేయాలో తెలుసా?     2018-05-05   06:52:38  IST  Raghu V

కుజుడుకి విపరీతమైన కోపం,అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉండుట వలన కుజుడి కారణంగా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. ఆ చెడు కాస్త తాత్కాలికంగా ఉన్నా విజయాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అసలు కుజ దోషం ఉందని ఎలా చెప్పుతారు. జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉన్నాడా? లేక చెడు స్థానంలో ఉన్నాడా అనే విషయాన్నీ జ్యోతిష్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

అంతేకాక ఆ ప్రభావము ఎన్ని రోజుల పాటు ఎలా ఉంటుందో అనే విషయం కూడా తెలుసుకోవాలి. కుజ దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతుందని అంటారు. కుజ దోష ప్రభావం అందరికి ఒకేలా ఉండదు. కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ప్రభావం మారుతూ ఉంటుంది. కుజుడు స్థానాన్ని బట్టి ప్రభావం ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు.