కేసీఆర్ కాసుకో...సవాల్ విసురుతున్న రెడ్లు     2017-10-19   01:21:20  IST  Bhanu C

Reddy’s politics in Telangaana

తెలంగాణలో కేసీఆర్ పాలన వచ్చాక..బంగారు తెలంగాణా ఏమో కానీ పాలిటిక్స్ మటకు ఎప్పుడు లేనంతగా రంజుగా ఉన్నాయి..వచ్చే ఎన్నికల్లో కూడా టీఆరెస్ హవానే కొనసాగుతుంది అని తెలిసిన నేపథ్యంలో..ప్రతిపక్షాలు మాటల దాడులు.. చేయడం..కుల రాజకీయాలు చేయడం మరింత పెంచేశాయి.కేసీఆర్ వీటన్నిటినీ సీరియస్ గా తీసుకోకపోయినా ..ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో వీటిపై ప్రత్యక దృష్టి పెట్టారని తెలుస్తోంది.

తెలంగాణ లీడర్లలో బోల్డ్ గా మాట్లాడే నేతల్లో ఒకరు జగ్గారెడ్డి..తాజాగా ఆయన ఇచ్చిన పిలుపు తెలంగాణా రాజకీయాలలో హీట్ పెంచుతోంది. కేసీఆర్ రెడ్లని కావాలనే అనగదొక్కుతున్నారు అని..ఈ సమయంలో రెడ్లు ఏ పార్టీలో ఉన్నాసరే బయటకి రావాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రెడ్లంతా ఏకం కావాలని ఆయన అన్నారు. వివిధ పార్టీల్లోని రెడ్లంతా బయటకు రావాలని.. ఏకం అయ్యి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో రెడ్లను అణగదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.