‘నేలటిక్కెట్టు’ అట్టర్‌ ఫ్లాప్‌కు 3 కారణాలు     2018-05-26   04:11:49  IST  Raghu V

రవితేజ హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేలటిక్కెట్టు’. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ గత చిత్రాలు ‘సోగ్గాడే చిన్ని నాయన’ మరియు ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా నాగార్జునతో ఈయన చేసిన సోగ్గాడే చిన్ని నాయన ఆ సంవత్సరంలోనే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌ కృష్ణ ఖచ్చితంగా ‘నేటిక్కెట్టు’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు.

రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమా తర్వాత నాగార్జునతో ఈయన సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఆ సమయంలోనే ఎప్పటి నుండో రవితేజతో సినిమా చేయాలనుకుంటున్న కళ్యాణ్‌ కృష్ణ ఆయన్ను సంప్రదించాడు. టచ్‌ చేసి చూడు సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో మారు మాట్లాడకుండా ఈయన దర్శకత్వంలో సినిమాకు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు రవితేజ. అతి తక్కువ సమయంలోనే చాలా స్పీడ్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించి అంతే స్పీడ్‌గా విడుదల చేశారు. ఎంత స్పీడ్‌గా అయితే సినిమా వచ్చిందో అంతే స్పీడ్‌గా సినిమా థియేటర్ల నుండి వెళ్లి పోయే పరిస్థితి. ఈ సినిమా ఫ్లాప్‌కు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.