రాజీవ్ కనకాల కు సినిమా అవకాశాలు రాకపోవడం వెనక కారణం ఇదేనట.? సుమ బయటపెట్టిన షాకింగ్ నిజం!  

రాజివ్ కనకాల ..మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు..హీరోగా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు.సహాయనటుడిగా మంచి పాత్రలు పోషించినా తగినన్ని అవకాశాలు రావట్లేదు.తనకి సరైన అవకాశాలు ఎందుకు రావట్లేదనే విషయం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు .ఈ విషయంలో రాజివ్ భార్య ,తెలుగులో టాప్ యాంకర్ సుమ రాజీవ్ కి క్లాస్ ఇచ్చిందట కూడా..ఇంతకీ రాజివ్ కి అవకాశాలు రాకపోవడం వెనుక కారణమేంటో తెలుసా..?

రాజీవ్ కనకాల బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆయన తండ్రి దేవదాస్ కనకాల సుప్రసిద్ధ దర్శకుడు.. అంతేకాదు ఆయన యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకున్న చాలా మంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇక భార్య సుమ అయితే టాప్ యాంకర్. ఆమె క్షణం తీరిక లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది.రాజివ్ కి ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు.కానీ స్నేహం పేరుతో వారిని అవకాశాలు అడగలేరట రాజీవ్..వారిని కలిసినప్పుడు సినిమా అవకాశాల గురించి కన్నా వారి స్నేహం గురించే ఎక్కువ మాట్లాడతారట.

అంతేకాదు అవకాశాలు కావాలంటే సినిమా వాళ్లతో రెగ్యులర్ టచ్ లో ఉండాలి..క్లోజ్ గా మూవ్ అవ్వాలి అది తన వల్ల కాదట..ఏమన్నా అవకాశాలు ఉంటే చూడండి అని నేను అడగలేను..ప్రోఫెషన్ వేరు ,స్నేహం వేరు అని అన్నారు రాజీవ్…ఈ విషయంపై సుమ కూడా తిట్టిందట.. రాజీవ్ స్నేహితుల్లో ఒకరే ఎన్టీయార్.ఎన్టీయార్ ప్రతి సినిమాలో రాజివ్ కి ఒక మంచి రోల్ ఉంటుంది.అంతేకాకుండా మరిన్ని హిట్ సినిమాల్లో కూడా రాజివ్ నటించాడు..