ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌కు కార‌ణాలివేన‌ట‌..     2018-05-03   01:43:00  IST  Bhanu C

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో వేగంగా అడుగులు వేస్తున్న కొద్దీ.. ఆయ‌నపై విమ‌ర్శ‌లు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వ‌స్తోంది. విమ‌ర్శ‌లకు త‌ట్టుకోగ‌లిగిన వాడే బ‌ల‌వంతుడు అని, వాటిని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని అభిమానులు, పార్టీ శ్రేణుల‌కు చెబుతుంటారు ప‌వ‌న్‌! రాజ‌కీయంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా వాటికి ఏదో ఒక సంద‌ర్భంలో బ‌దులిచ్చేస్తుంటాడు. అయితే ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చాక వ‌చ్చాక రాజ‌కీయంగానే గాక వ్య‌క్తిగ‌తంగానూ ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేసే అంశం పెళ్లిళ్లు!! ఈ విమ‌ర్శ‌లు ప‌వ‌న్ వ‌ర‌కూ వెళ్లినా.. వాటిపై అంత క్లారిటీ ఇచ్చిన దాఖ‌లాలు ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌వు. అయితే ఆయన చెప్ప‌క పోయినా.. పార్టీ త‌ర‌ఫున స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి అద్దేప‌ల్లి శ్రీ‌ధ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు.

`మూడు పెళ్లిళ్లు చేసుకున్నానో నాకు తెలుసు. ఆ బాధ మీకెలా తెలుస్తుంది` అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక బ‌హిరంగ స‌భ‌లో చెప్పిన మాట‌లు అటు అభిమానుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల్లోనూ ఎన్నో సందేహాలు క‌ల‌గ‌జేశాయి. ఇప్ప‌టికీ ప‌వ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసేవాళ్లు కూడా ఈ అంశంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో త‌నను ఎక్కువ‌గా టార్గెట్ చేసే వాళ్ల‌కి ఏమాత్రం అవ‌కాశమివ్వ‌కూడ‌ద‌ని అనుకున్నాడో ఏమోగానీ.. మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. పవన్ మూడు వివాహాలు చేసుకున్నాడంటూ దానికి తమదైన కామెంట్ను జోడిస్తూ వారు విమర్శలు చేస్తుంటారు. అయితే ఈ కామెంట్ కు తాజాగా క్లారిటీ వచ్చింది.