రామోజీతో జగన్ కాళ్ళ బేరం..     2017-10-23   23:03:48  IST  Bhanu C

Reason Behind Jagan Meets Ramoji

కోర్టులో తమకి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన జగన్ కి షాక్ ఇచ్చింది సిబిఐ నాయస్థానం..జగన్ అభ్యర్ధనని తోసిపుచ్చుతూ..మీకే మంచిది కొంచం రెస్ట్ దొరికినట్టుగా ఉంటుంది. ఈ విషయంలో మీకు వెసులుబాటు ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌మోష‌న్ కోసమంటూ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డం మొద‌లెట్టారు. తన పాదయాత్ర కి హైప్ క్రియేట్ చేయడానికి జగన్ అన్ని ప్రయత్నాలని చేస్తున్నాడు…తానూ ఒక వర్గానికి చెందిన వాడిని కాదు అని చెప్పడానికి..ఇటీవలే చినజీయర్ స్వామిని కలిసిన జగన్‌…. తాజాగా సోమవారం సాయంత్రం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ జరిగింది.

జగన్ రెడ్డి రామోజీ ని కలవడం వెనుకాల అంతర్యం ఏమిటో ఎవ్వరికీ తెలియకపోయినా..ఈ భేటి చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రామోజీ చుట్టూ తిరుగుతుంది..రామోజీ కూర్చున్న చోటునుంచే వేగంగా పావులు కదపగల సిద్ధహస్తుడు..చంద్రబాబు సక్సెస్ వెనుకాల రామోజీ హస్తం లేకుండా పోలేదు. అలాంటి రామోజిరావుని జగన్ కలవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది.