ఇది వర్కౌట్‌ కాకుంటే సగానికి పడిపోనుంది     2018-05-14   21:47:59  IST  Bhanu C

మాస్‌ మహారాజా రవితేజ కుటుంబ కారణాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు రెండు సంవత్సరాలు కూడా రవితేజకు సక్సెస్‌ అనేది లేదు. అంటే నాలుగు సంవత్సరాల తర్వాత రవితేజ నుండి రాజా ది గ్రేట్‌ రూపంలో ఒక సక్సెస్‌ వచ్చిందన్నమాట. ఆ సక్సెస్‌ మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది. ఆ వెంటనే వచ్చిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘నేల టికెట్‌’.

వరుసగా రెండు విజయాలను దక్కించుకున్న కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు మరియు ఆయన స్టైల్‌కు తగ్గట్లుగా సినిమాను డిజైన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితేనే రవితేజ కెరీర్‌ ఇదే జోరుతో ముందుకు వెళ్తుంది. లేదంటే ఆయన చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ‘నేల టికెట్‌’ కోసం ఏకంగా 8 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక వేళ నేల టికెట్‌ చిత్రం ఫ్లాప్‌ అయితే ఆయన పారితోషికం 4 లేదా అంతకంటే తక్కువ పారితోషికంకు పడిపోయి అవకాశం ఉంది.