ఆయన కోసం బన్నీ, రవితేజ ఫైట్‌     2018-05-23   06:53:01  IST  Raghu V

అల్లు అర్జున్‌, రవితేజల మద్య ఫైట్‌ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? వీరిద్దరు డైరెక్ట్‌గా తపడటం లేదు, అలాగని తమ తమ సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు ఢీ కొట్టడం లేదు. వీరిద్దరు కూడా ప్రస్తుతం ఒక దర్శకుడి కోసం ఫైట్‌ చేస్తున్నారు. ఆ దర్శకుడితో నేను సినిమా చేస్తా అంటే నేను సినిమా చేస్తాను అంటూ తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతగా వీరు ఫైట్‌ చేస్తున్న ఆ దర్శకుడు ఎవరు అయ్యి ఉంటారని అనుకుంటున్నారా.. ఆయన మరెవ్వరో కాదు విఐ ఆనంద్‌. ఈ విభిన్న చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆ ఇద్దరు ప్రస్తుతం పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఈయన ఎవరితో ముందు సినిమా చేస్తాడా అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఇటీవలే ‘నా పేరు సూర్య’ చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చాడు. దాంతో తర్వాత సినిమా చాలా విభిన్నంగా ఉండటంతో పాటు, ప్రేక్షకులను థ్రిల్‌ చేసే విధంగా ఉండాలని భావిస్తున్నాడు. అందుకోసం విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విఐ ఆనంద్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. ఆనంద్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క క్షణం చిత్రం సమయంలోనే అల్లు అర్జున్‌తో ఆనంద్‌కు పరిచయం ఏర్పడటం, ఇద్దరి మద్య సినిమాల గురించి చర్చ రావడం, ఆ సమయంలోనే ఒక స్టోరీ లైన్‌ చెప్పడం జరిగింది. ఆ స్టోరీతో సినిమా చేయాలని ఇప్పుడు అల్లు అర్జున్‌ కోరుకుంటున్నాడు.