దసరాకు రాబోతున్న పందిపిల్ల.. ఎన్టీఆర్‌తో పోటీని తట్టుకునేనా     2018-08-20   12:48:28  IST  Ramesh P

విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను దక్కించుకున్న రవిబాబు ఈసారి కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ చిత్రంలో రవిబాబు పందిపిల్లను కీలక పాత్రగా తీసుకున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ చిత్రం కోసం ఒక పందిపిల్లను రవిబాబు పెంచుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక పెంపుడు కుక్క మాదిరిగానే రవిబాబు ‘అదుగో’ సినిమా కోసం పంది పిల్లను పెంచుకోవడం కాస్త విచిత్రంగా అనిపించినా, ఎక్కువ మందిని ఆలోచింపజేసింది. దాంతో అదుగో చిత్రానికి మంచి పబ్లిసిటీ దక్కింది.

Dasara Releasing Movies,NTR Aravinda Sametha,Ravi Babu Film Adhugo Will Release In This Dasara,Ravi Babu Movie

సురేష్‌బాబు నిర్మాణంలో తెరకెక్కిన ‘అదుగో’ చిత్రంను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అయినా కూడా ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నారు. ఈ చిత్రంను దసరాకు విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత సురేష్‌బాబు ప్రకటించాడు. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా సమాచారం అందుతుంది. 5 కోట్ల బడ్జెట్‌తో దాదాపు రెండు కోట్ల రూపాయలు విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఖర్చు చేశారు.

Dasara Releasing Movies,NTR Aravinda Sametha,Ravi Babu Film Adhugo Will Release In This Dasara,Ravi Babu Movie

భారీ అంచనాలున్న ఈ చిత్రంను దసరాకు విడుదల చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే దసరా బరిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆ నాలుగు చిత్రాల్లో ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అందుకే సినిమాకు పోటీగా పందిపిల్ల వస్తుంది అనగానే కాస్త ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.

రవిబాబు ఏ సినిమా చేసినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఎంతటి పోటీ ఉన్నా కూడా రవిబాబును అభిమానించే వారు ఆయన సినిమాను తప్పకుండా చూస్తారు. అందుకే రవిబాబు తన చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రవిబాబు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.