Rashmi and Tejaswi support bold movies in Tollywood

గత రెండేళ్ళలో టాలివుడ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకుముందులా రోటీన్ మాస్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు ప్రేక్షకులు. కొత్తదనం కావాలి, కొత్త కథలు కావాలి. అందుకే బోల్డ్ సినిమాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు దర్శకులు. గుంటూర్ టాకీస్ ఎంత బోల్డ్ గా ఉంటుందో, అందులో యాంకర్ రష్మీ ఎంత బోల్డ్ పాత్ర చేసిందో మనం చూసాం. వీర్యదానం గురించి తీసిన “నరుడా డోనారుడా” ఆడకపోయినా, తెలుగువారు అలాంటి ప్రయత్నం ఒకటి చేయడం మెచ్చుకోదగ్గ విషయమే. ఇటివలే విడుదలైన “బాబు బాగా బీజీ” కూడా బోల్డ్ సినిమానే. తేజస్వీ మడివాడ చేయబోతున్న తదుపరి సినిమాలో తనది కాస్త భిన్నమైన పాత్ర. టీనేజర్స్ కి సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చే పాత్ర. ఒక రష్మీ ఇప్పటికి రెండుమూడు బోల్డ్ సినిమాలు చేసింది. మొత్తం మీద టాలివుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలవుతోంది. ఈ మార్పు మంచిదే అంటున్నారు రష్మీ – తేజస్వీ.


“టైమ్ మారింది. అలాగే ప్రేక్షకులు మారుతున్నారు. విభిన్న కథలను వారు చూడాలనుకుంటున్నారు. నేను ఆ సినిమాలో (గుంటూర్ టాకీస్) చాలా అందంగా కనిపించాను. అలాంటి సెక్సి డ్రామాలో నన్ను తీసుకున్నందుకు దర్శకుడికి ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువే” అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.

“నేను ఒక నటిని. నేను ప్రేక్షకులకి వినోదాన్ని పంచాలి. నా రెండు అడల్ట్ సినిమాల కథలు పూర్తిగా వేరు (బాబు బాగా బీజీ & బాలక్ పాలక్ రీమేక్). ఇప్పుడు చేస్తున్న బాలక్ పాలక్ అనే మరాఠీ చిత్రం రీమేక్ లో నేను సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాను” అంటూ తేజస్వీ ఓ అంగ్ల దినపత్రికకు తన వెర్షన్ వినిపించింది.

కొత్త కథలు ఎంచుకున్నా, అందులోనూ అడల్ట్ సినిమా తీసినా, ఎటుచేసి ప్రేక్షకుడికి కావాల్సింది ఆసక్తికరమైన కథ. అది సరిగా కుదరకే లేక తీయలేకే ఇప్పటివరకు తీసిన బోల్డ్ సినిమాలు బోల్తకొట్టాయి. కేవలం అడల్ట్ కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకలు ఈరోజుల్లో థియేటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా.