మహేష్‌, చరణ్‌లలో విజేత ఎవరో తేలిపోయింది     2018-06-18   22:57:10  IST  Raghu V

ఈ సమ్మర్‌కు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ దక్కాయి. శ్రీమంతుడు చిత్రం తర్వాత కొరటాల, మహేష్‌బాబుల కాంబో మూవీ అవ్వడంతో ప్రేక్షకులు విపరీతంగా సినిమాను ఆధరించారు. సినిమా చాలా బాగుందనే టాక్‌ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్లు హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. మహేష్‌బాబు సీఎంగా కనిపించిన విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లతో టాలీవుడ్‌ నెం.3 చిత్రంగా మహేష్‌ బాబు మూవీ నిలుస్తుందని ఆశించారు, కాని అది జరగలేదు.

మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం కంటే ముందు వచ్చిన రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించింది. 85 కోట్లు వసూళ్లు చేస్తే అప్పటికే గొప్ప అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా రంగస్థం చిత్రం సునాయాసంగా 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడంతో పాటు లాంగ్‌ రన్‌లో ఏకంగా 126 కోట్ల రూపాయల షేర్‌ను దక్కించుకుని టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచింది. రామ్‌ చరణ్‌ చెవిటి వాడిగా నటించడంతో పాటు సమంత అద్బుతమైన నటనతో సినిమాకు హైలైట్‌గా నిలిచారు. సుకుమార్‌ ఈ చిత్రాన్ని పూర్తి పల్లెటూరు వాతావరణంలో అది కూడా 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.