200 కోట్లు : ‘రంగస్థలం’ పరువు తీశారు     2018-05-01   07:09:46  IST  Raghu V

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీ ఎత్తున కలెక్షన్స్‌ను సాధించింది. 1980 కాలంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో వసూళ్లు చేసిన ఈ చిత్రం రికార్డులు నమోదు చేసింది. ఈ సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిన ఒక పని ప్రస్తుతం విమర్శల పాలు అవుతుంది. రంగస్థలం చిత్రం ఇప్పటి వరకు 185 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం రికార్డు కోసం 200 కోట్లు వచ్చాయి అంటూ ప్రకటించారు.

‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల్లోనే 100 కోట్లను వసూళ్లు చేసింది. ఆ తర్వాత కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి. ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదల తర్వాత రంగస్థలం చిత్రంకు చాలా తగ్గాయి. మహేష్‌బాబు నటించిన భరత్‌ అనే నేను చిత్రం అన్ని ఏరియాల్లో కూడా దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించాయి. ఇలాంటి సమయంలో రంగస్థలం చిత్రం భారీగా వసూళ్లు సాధించింది అంటూ చెప్పడం నమ్మశక్యంగా లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినీ ట్రేడ్‌ పండితులు కూడా రంగస్థలం కలెక్షన్స్‌పై పెదవి విరుస్తున్నారు.