రంగస్థలం మూవీ రివ్యూ     2018-03-29   23:18:21  IST  Raghu V

డైరెక్టర్ – సుకుమార్

నిర్మాత – మొహన్ చెరుకూరి ,నవీన్ ఎమినేని, రవి శంకర్

నటీనటులు – రామ్ చరణ్,సమంతా ,ఆది పినిశెట్టి జగపతి బాబు..

సంగీతం – దేవీశ్రీ ప్రసాద్

స్క్రీన్ ప్లే – సుకుమార్

నిర్మాణ సంస్థ – మైత్రి మోవీ మేకర్స్

రిలీజ్ డేట్ – 30 మార్చ్ – 2018

నిడివి – 3 hr

మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..మరియు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మీద ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి..దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే అందరినీ అలరించిందని టాక్ అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులని అలరించిందా.. రామ్ చరణ్ ఒక వైవిధ్యమైన పాత్రని పోషించాడు ఆ పాత్రకి న్యాయం చేయగలిగాడా లేదా అనేది చూద్దాం

కథ :

రంగస్థలం నేది ఒక ఊరు ఆ ఊరిలో ఎవరికీ ఏ అవసరం వచ్చినా సరే చిటికెలో చేసిపెట్టే వాడు చిట్టి బాబు (రామ్ చరణ్ ) చెవిటి వాడే అయినా అవతల వాళ్లు పెదాల కదలికను బట్టి మ్యాటర్ అర్ధం చేసుకుంటాడు…ఊళ్ళో ఆనందం ఎలా ఉంటుంది దాని వేనుకాలో కుట్రలు కుతంత్రాలు కూడా అలానే ఉంటాయి.. ఊరు రాజకీయాలను శాసించాలని నిర్ణయించుకున్న కుమార్ బాబు (ఆది)కి చిట్టి బాబు సపోర్ట్ గా నిలుస్తాడు. ప్రెసిడెంట్ గా ఉన్న జగపతిబాబును గద్దె దించే ప్రయత్నం చేస్తారు…ఈ సమయంలోనే చిట్టిబాబుకి కుమార్ బాబుకి గొడవలు అవుతాయి. ఇంతకీ కుమార్ బాబు గెలుస్తాడా ? లేక చిట్టి బాబు గెలుస్తాడా ..? అతను గెలిచాక అతను ఏం చేశాడు..? చిట్టి బాబుకి కుమార్ బాబు మధ్య గొడవలు అసలు ఎందుకు వచ్చాయి అనేది సినిమా కధ..