వెంకన్న అంటే నమ్మకం లేని జగన్ వద్దకి దీక్షితులు..గతం మర్చిపోయారా..?     2018-06-08   00:15:30  IST  Bhanu C

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన దేవాలయం ఏపీ లోని తిరుమల తిరుపతి క్షేత్రం..ఎంతో మంది భక్తులు విదేశీ భక్తులు సైతం స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంలో మతం మార్పిడి అయిన వాళ్ళు వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఆలయ నిభంధనల ప్రకారం తప్పకుండా అక్కడ ఉండే డిక్లరేషన్ పై సంతకం పెట్టి వెళ్ళాలి..ఆ డిక్లరేషన్ సారాంశం ఏమిటంటే..నేను మతం మారినా సరే స్వామి వారిపై ఎంతో నమ్మకంతో వచ్చారు ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఉంది అని అన్ని సమ్మతించి నేను దర్సనం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పడానికి ఈ డిక్లరేషన్ పై సంతకం తీసుకుంటారు..సరే ఈ విషయం కాస్త పక్కన పెడితే..

గత 15 రోజులుగా తిరుమల కొండపై జరుగుతున్న రాజకీయాలు మనకి తెలిసినవే ఎవరి స్వార్ధానికి వాళ్ళు తిరుమలని రాజకీయంగా ఉపయోగిస్తున్నారు..గత 30 ఏళ్లుగా పని చేస్తున్నాను స్వామి దగ్గర అని చెప్తున్న ఆయన అక్కడ అక్రమాల గురించి విలేఖరుల సమావేశం పెట్టి మరీ తిరుమలని రోడ్డు కి ఈడ్చుతున్న ఆయన ఇప్పుడు హటాత్తుగా ఎందుకు బయటకి వచ్చారు ఇన్నేళ్ళు ఎక్కడ దాక్కున్నారు..? అంటే ఆ ప్రశ్నకి సమాధానం లేదు సరే టీడీపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇప్పుడు బీజేపి వద్దకి వెళ్లినట్లుగానే మీడియా ముందు మాట్లాడినట్టుగానే ఎందుకు అప్పుడు స్పందించలేదు..?