మోడీ కి షాక్ ఇచ్చిన కీలక నేత..బీజేపి కి గుడ్ బై     2018-06-21   01:09:42  IST  Bhanu C

ఎన్నికలు ఎంతో దూరంలో లేవు..కేంద్రంలో బలమైన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపి లు ఎవరి వ్యూహాలతో దూసుకుపోతున్నారు..పార్టీల లోకి రావాలన్నా…రాజకీయ నేతలు పార్టీ గోడలు దూకాలంటే ఇదే సరైన సమయం కూడా..అయితే గడిచిన నాలుగేళ్ళుగా ఏక చత్రాదిపత్యం గా ఏలిన మోడీ కి ఎన్నికల సమయంలో కోలుకోలేని దెబ్బలు తగుతుతూనే ఉన్నాయి..మోడీ షా ల నియంతృత్వ వ పాలనకు అధికార దాహానికి వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. దానిని ఆమోదించలేని వివిధ రకాల నాయకులు బిజెపి కి దూరం అవుతూనే ఉన్నారు.

అయితే ఈ క్రమంలోనే బిజెపికి మరొక కీల‌క నేత దూరం అయ్యారు..పార్టీని నడిపించడంలో ఎంతో వ్యుహత్మకంగా వ్యవహరించే ఆయన దూరం అవ్వడం పార్టీ కి తీరని నష్టమే ఎందుకంటే..జ‌నం నాడి క‌నిపెట్టి, బీజేపీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దే వారిలొ ఈయన విశేషం..అందులోనూ బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ శిబిరంలోని ప్ర‌ధాన వ్య‌క్తి అంతేకాదు ఇండియా ఫౌండేష‌న్ లో ప‌రిశోధ‌కుడిగా కూడా ఉన్నారు ఆయన ఎవరో కాదు శివం శంక‌ర్ సింగ్..