Rakul Preet to sizzle in an erotic film ?

ఇప్పుడు రకుల్ ప్రీత్ తెలుగు అమ్మాయి కాదు అంటే నమ్మడం కష్టం. అంతలా తెలుగు ప్రపంచంలో కలిసిపోయింది ఈ పంజాబీ అమ్మాయి. అసలు రకుల్ కూడా తనని తాను తెలుగు అమ్మాయిలానే ఫీల్ అవుతోంది. ఇక ఈ ఉత్తరాదిభామ హిందీలో చేసిన మొదటి సినిమా యారియాన్. ఈ సినిమాకి దివ్యా ఖోస్లా కుమార్ అనే మహిళ దర్శకురాలు. ఇప్పుడు అదే దివ్యా ఖోస్లా కుమార్ మళ్ళీ రకుల్ ని బాలివుడ్ కి రప్పిస్తోందట. ఈసారి చిన్న సినిమా ఏం కాదు లేండి, ఏకంగా అక్షయ్ కుమార్ సరసన రకుల్ జోడి కట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రకుల్ తో పాటు నాగిని సీరియల్ ఫేం మౌని రాయ్ కూడా మరో హీరోయిన్ గా నటించనుందట.

అయితే ఇప్పుడు ఏంటి అని తేలిగ్గా తీసిపారేయకండి .. రకుల్ కెరీర్లో ఇదో వెరైటి చిత్రం కాబోతోంది. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదట. ఎరోటిక్ సినిమా అంట. అంటే శృంగారభరితమైన సినిమా అన్నమాట. హాలివుడ్ లో ఇలాంటి సినిమాలు బాగా ఫేమస్. మన ఇండియాలో కూడా “హెట్ స్టోరి” అనే ఎరోటిక్ సీరిస్ ఉంది. ఘాటు ఘాటు బెడ్ రూమ్ సన్నివేశాలు, పదుల సంఖ్యలో ముద్దు సీన్లు, బికినిలో, కుదిరితే అర్థనగ్నంగా కనిపించే హీరోయిన్లు .. ఇవే ఉంటాయి ఎరోటిక్ సినిమాల్లో. ఇలాంటి సినిమాలో రకుల్ కనిపిస్తే కుర్రాళ్ళ గుండెలు ఎమైపొనూ !

ఇక రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ ఇలాంటి సినిమా మీ హీరొయిన్ చేస్తోందని అప్పుడే కంగారు పడొద్దు. ప్రస్తుతానికైతే చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. ఇది కేవలం ఆ దర్శకురాలి ఆలోచన. అసలు ఇలాంటి సినిమాకి ముందుగా అక్షయ్ కుమార్ ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటేనే సినిమా ముందుకి పోతుంది. టాలివుడ్ లో తనకున్న ఇమేజ్ వలన రకుల్ కూడా ఇలాంటి ఓవర్ రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు.