నా జోరు మీకు తెలియడం లేదు.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు..     2018-09-10   10:02:54  IST  Ramesh P

టాలీవుడ్‌లో చిన్న చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అనుకోని అవకాశంగా అదృష్టం కలిసి వచ్చి టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అందరితో కూడా దాదాపుగా నటించేసింది. తెలుగులో స్పైడర్‌ మరియు జయ జానకి నాయక చిత్రం తర్వాత సైలెంట్‌ అయ్యింది. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతానికి ఒక్కటి కూడా నటించడం లేదు. దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పనైపోయింది అంటూ అంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మీడియాతో మాట్లాడిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేసింది.

Rakul Preet Next Movie,Rakul Preet Sing,Rakul Preet Sing Latest Movies

రకుల్‌ మాట్లాడుతూ.. స్పైడర్‌ చిత్రం తర్వాత కాస్త జోరు తగ్గిందని నా గురించి తెలుగు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కాని నేను చాలా బిజీగా ఉన్నాను. డైరీలో ఉన్న 30 రోజులు కూడా నేను చాలా బిజీగా చిత్రాలు చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో నటించడం లేదు కాని, తమిళంలో మాత్రం చాలా బిజీగా ఉన్నాను. మరోవైపు హిందీలో స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నాను. తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా బిజీగా ఉండటం వల్ల వాటికి ఓకే చెప్పలేక పోతున్నట్లుగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పుకొచ్చింది.

నేను సినిమాల ఆఫర్లు లేక ఖాళీగా ఉన్నాను అంటూ మాట్లాడుతున్న వారు తమిళ సినిమా పరిశ్రమలో తాను చేస్తున్న సినిమాల గురించి అవగాహణ లేకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. స్పైడర్‌ చిత్రం సమయంలో తమిళం నుండి నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. అవి పూర్తి కాకుండానే మరో రెండు చిత్రాలకు సైన్‌ చేశాను. అలా వరుసగా తమిళ చిత్రాలను చేయాల్సి వస్తుంది. మరో వైపు హిందీ సినిమాలో కూడా నటిస్తున్న నేను ఖాళీగా ఉన్నట్లుగా మీకు ఎలా కనిపిస్తుంది అంటూ ప్రశ్నిస్తుంది.

Rakul Preet Next Movie,Rakul Preet Sing,Rakul Preet Sing Latest Movies

టాలీవుడ్‌లో ఈమె ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల ఆ పాత్ర గురించి స్పందిస్తూ ఎన్టీఆర్‌ చిత్ర దర్శకుడు క్రిష్‌ నన్ను సంప్రదించారు. అయితే ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా త్వరలోనే క్రిష్‌ను కలిసి శ్రీదేవి పాత్రకు సంబంధించిన అగ్రిమెంట్‌పై సైన్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.