ఎన్టీఆర్ బయోపిక్ లో రాశి ఖన్నా, రకుల్ ప్రీత్, కీర్తి సురేష్..! ఏ పాత్రల్లో నటిస్తున్నారో తెలుసా.?     2018-08-20   11:08:46  IST  Sainath G

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు.

స్వాతంత్రదినోత్సవాన్ని పురష్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేసి క్రిష్ విశేషమైన రెస్పాన్స్ ను అందుకొన్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం, బాలయ్య అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ లా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Keerthy Suresh As Savitri,Ntr Biopic,Rakul Preet As Sridevi,Rana As Chandrababu,Rashi Khanna

ఇప్పటికే ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. సావిత్రిగా కీర్తి సురేష్.. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరొక పాత్ర కోసం రాశి ఖన్నాను సంప్రదించారు చిత్ర బృందం. జయప్రదంగా ఈ సినిమాలో రాశి ఖన్నా కనిపించనున్నారు.