రాజు గారి గది 2 మూవీ రివ్యూ

చిత్రం : రాజు గారి గది 2
బ్యానర్ : PVP సినిమా
దర్శకత్వం : ఓంకార్
నిర్మాత : పివిపి
సంగీతం : తమన్
విడుదల తేది : అక్టోబర్ 13, 2017
నటీనటులు : నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్ బాబు తదితరులు

కథలోకి వెళితే :

ముగురు స్నేహితులు అశ్విన్, వెన్నెల కిషోర్ ఒక సి సైడ్ రిసార్ట్ కొనుగోలు చేస్తారు. కాని ఆ రిసార్ట్ కొన్నప్పటి నుంచి వారి జీవితాలు దుర్భరం అవుతాయి. ఆ రిసార్ట్ లో ఒక ఆత్మ ఉంది. అదే వారిని భయపెడుతోంది. దాంతో ఒక మెంటలిస్టు రుద్రని (నాగార్జున) ఆశ్రయిస్తారు ఆ ముగ్గురు స్నేహితులు. ఇంతకి రుద్ర ఆ ఆత్మ నుంచి వారికి విముక్తి కలిగించగలిగాడా? ఈ కథలో అమృత (సమంత) కి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెరపైనే చూడండి.

నటీనటుల నటన :

మెంటలిస్టుగా నాగార్జున పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు. రాజు గారి గదిలో మిస్ అయిన ఆ స్టార్ బలం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ నాగార్జున మోస్తే సెకండాఫ్ చాలావరకు తన మీద వేసుకుంది సమంత. బాగా రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసింది తను. అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్ మరియు ప్రవీణ్ లు నవ్వించడానికి బాగా ప్రయత్నించిన, రాసుకున్న కామెడి సీన్స్ బాగా లేకపోయేసరికి తేలిపోతాయి అవి. సీరత్ కపూర్ గ్లామర్ షో యువతని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.