జక్కన్న మనసులో వీళ్ళిద్దరు ఉన్నట్లేనా     2018-06-29   23:51:23  IST  Raghu V

‘బాహుబలి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంను ప్రకటించినప్పటి నుండి కూడా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న ఏం చేసినా ఫర్‌ఫెక్ట్‌గా చేయాలని భావిస్తాడు. అందుకే మల్టీస్టారర్‌ చిత్రం విషయంలో కూడా హడావుడి లేకుండా మెల్లగా సినిమాకు సంబంధించిన వర్క్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం మరో వైపు నటీనటుల ఎంపిక కార్యక్రమం కూడా జరుగుతుంది. నటీనుటులు అనగానే ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్స్‌ ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం అనుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది పేర్లు ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌లకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలను జక్కన్న ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అందులో మొదటగా ‘మహానటి’ చిత్రంతో నటిగా నిరూపించుకున్న కీర్తి సురేష్‌ కాగా, రెండవ హీరోయిన్‌గా అదితి రావును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.