గీత గోవింద చిత్రం చూసిన మెగాస్టార్ ఏమన్నారో తెలుసా.? రాజమౌళి ట్వీట్ హైలైట్!     2018-08-16   10:23:45  IST  Sainath G

ప్రస్తుతం తెలుగులో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. తనదైన నటన, డైలాగ్ డెలివరీతో విజయ్ యువతకు బాగా దగ్గరైపోయాడు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్‌కు స్టార్‌డమ్ వచ్చి పడింది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

సినిమా విడుదలకు ముందే కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీకవడం కలంకలం రేపింది. దీంతో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా, సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. అయితే ఒకరకంగా దీనివల్ల సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ లీక్ మూలంగా సినిమాకు బజ్ పెరిగిపోయింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా నిన్నే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా. సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు.

Rajamouli And Chiru Comments,Vijay Devarakonda

మెగాస్టార్ చిరంజీవి కోడం గీత గోవిందం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేశారు. సినిమా చూశాక మెగాస్టార్ చిరు గీత గోవిందం చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ని ప్రత్యేకంగా అభినందించారు.

విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు. ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని రాజమౌళి ప్రశంసలు అందించారు.