Raja the Great Movie Review

చిత్రం : రాజా ది గ్రేట్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : సాయి కార్తిక్
విడుదల తేది : అక్టోబర్ 18, 2017
నటీనటులు : రవితేజ, మెహ్రీన్, రాధిక, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు

కథలోకి వెళితే :

రాజా (రవితేజ) పేరుకే అంధుడు. పోలీసు కావాలన్న లక్ష్యంతో అన్నిరకాలుగా ట్రేయిన్ అయి ఉంటాడు. సమర్థుడు, అలాగే బలవంతుడు. మరోవైపు ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) కూతురు లక్కి (మెహ్రీన్) ని చంపేందుకు యత్నిస్తుంది విలన్ గ్యాంగ్. దాంతో లక్కి డార్జిలింగ్ పారిపోతుంది. రాజా లక్కికి ఎలా తారసపడ్డాడు, ఎందుకు తారసపడ్టాడు. లక్కిని ఆపదలోంచి కాపాడగలిగాడా లేదా అనేది థియేటర్లో చూడండి‌.

నటీనటుల నటన :

చాలారోజుల తరువాత రవితేజ ఒకప్పటి రవితేజలా స్క్రీన్ మీద కనిపించారు. గడ్డం పూర్తిగా పెంచడం వలనో, ఆమధ్య ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవడం వలనో కాని, రవితేజ లుక్ ఫ్రెష్ గా ఉంది. పోషించింది అంధుడి పాత్రే అయినా, ఇందులో రవితేజ నుంచి అన్ని అంశాలుంటాయి. ఇటు ఫైట్స్ లో, అటు కామెడిలో తన టపికల్ మాస్ అటీట్యూడ్ చూపించాడు రవితేజ. మెహ్రీన్ కి కథలో మంచి ఇంపార్టెన్స్ దొరికింది. బాగా సద్వినియోగం చేసుకుంది అని చెప్పలేం కాని, బాగానే చేసింది. వివన్ భటేనా విలనీజం ఫర్వాలేదు‌. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లు, బాంబే నుంచి వస్తున్న విలన్స్ లో ఈయన కొద్దిగా బెటర్. రాజేంద్రప్రసాద్ షరామామూలే‌. రాజా తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. మాస్ కి ఆమె పాత్ర నచ్చుతుంది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తమ పాత్రపరిధి మేరలో నటించారు. హరితేజ గున్నగున్న మామిడి ఓ హైలెట్.