ఏపీ నాయకులకు రాహుల్‌ కీలక ఆదేశం.. ఏంటో తెలిస్తే షాక్‌!     2018-07-02   00:17:50  IST  Bhanu C

2014కు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలమైన పార్టీగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బలం పుంజుకోవడం ఖాయం అని, ఏపీలో కాస్త తగ్గినా, ఆ వెంటనే మళ్లీ నిలదొక్కుకుంటాం అని పార్టీ అధినాయకత్వం భావించి రాష్ట్రంను రెండుగా విడదీసిన విషయం తెల్సిందే. తెలంగాణలో అధికారం దక్కించుకుంటాం అని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. ఇక ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. కనీసం ఏపీలో పోటీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. అన్యాయంగా ఏపీని విడదీసి ఆంధ్రాకు అన్యాయం చేశారు అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటీ అనేది 2014 ఎన్నికలతో తేలిపోయింది. 2019లో అయినా కాస్త బలం పుంజుకుంటుందేమో అని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇప్పటి వరకు పార్టీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారు అయ్యింది. అయితే మరో పది నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఏపీపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో పార్టీని వదిలేసి వెళ్లిన సీనియర్‌ నాయకులను మరియు మాజీ మంత్రులను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దం అయ్యింది.