అల్లు అరవింద్, దిల్ రాజుని తిట్టేసిన ఆర్.నారాయణమూర్తి

ఇప్పుడున్న లీజ్, రెంట్ సిస్టమ్ వలన సినిమా థీయేటర్లు చాలావరకు కొంతమంది చేతుల్లో ఉంటున్నాయని చిన్న నిర్మాతలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. అందులో ముగ్గురి పేర్లు బయటకి బాగా వినబడతాయి. వాళ్ళే, అల్లు అరవింద్, దిల్ రాజు మరియు సురేష్ బాబు. వీళ్ళు ఇస్తేనే ఏవరికైనా థియేటర్లు దొరికేవి అనే అరోపణ ఉంది. నిజానిజాలు పక్కనపెడితే, సంక్రాంతికే వస్తున్న ఆర్.నారాయణమూర్తి కొత్త సినిమా “కానిస్టేబుల్ వెంకట్రామయ్య” సినిమాకి థియేటర్లు దొరకట్లేదట.

ఈ విషయంపై ఆర్. నారాయణమూర్తి నిప్పులు చెరిగారు. పేర్లు బయటకి చెప్పలేదు కాని సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు, ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి చిత్రాల మీద, వాటి వెనుక ఉన్న బడా బాబుల మీదే ఆయన దాడి అని మనకు తెలియదా!

ఇలా థియేటర్లన్ని వాళ్ళే తీసేసుకుంటే, చిన్న సినిమాలు ఎలా బ్రతకాలి. పెద్ద సినిమాల్లాగా వేల థియేటర్లు, ఊరిలో ఉన్న థియేటర్లన్ని అక్కరలేదని, ఊరికి ఒక్క థియేటర్ అయినా ఇప్పించాలి. ఆ బాధ్యత నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్, ప్రభుత్వం మీద ఉందని ఆర్ నారాయణమూర్తి అన్నారు.

బడాబాబులు ప్రతీ పండగ ఆక్రమించేసుకోని, థియేటర్లన్ని వారి చేతిలో పెట్టుకుంటే చిన్న సినిమా చనిపోతుందని, అది ఇండస్ట్రీకి మంచిది కాదు, పోటివాతవారణం ఉండాలని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేసారు.