Puri says he won’t go to Bangkok for $ex and massage

ఓవైపు సిట్ ప్రశ్నిస్తున్న సెలబ్రిటీలు ఒకరి తరువాత టాలివుడ్ లో ఇప్పుడున్న డ్రగ్ మాఫియాకి పూరి జగన్నాథ్ కారణం, ఆయన టాలివుడ్ లో చాలామందికి డ్రగ్స్ అంటించారు, రేవ్ పార్టీ కల్చర్ ని అలవాటు చేసారు అంటూ ఆరోపిస్తోంటే, పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా తనని తను డిఫెండ్ చేసుకుంటూనే ఉన్నారు. తానూ ఎప్పుడు ఇల్లీగల్ పనులు చేయలేదని, ఎప్పుడు చేయనని, తనలాంటి బాధ్యత కలిగిన మనిషిపై నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా ఓవర్ యాక్షన్ చేసిందని కామెంట్ చేసిన పూరి, ఈసారి తన బ్యాంకాక్ పర్యటనల గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.

పూరి జగన్నాథ్ తరచుగా బ్యాంకాక్ వెళుతుంటారు. విదేశాల్లోంచి పూరి డ్రగ్స్ హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీనిని ఖండించిన పూరి, బ్యాంకాక్ కి తానూ కేవలం కథలు రాసుకోవడానికే వెళతాను తప్ప, మరో కారణం లేదని చెప్పారు. తానూ బ్యాంకాక్ కి ఎందుకు వెళతాను అనే విషయం మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, చాలామంది తాను అక్కడికి అమ్మాయిలతో శృంగారం కోసం లేదంటే మసాజ్ కోసం వెళ్తానని అనుకుంటారు, నేను మసాజ్ చేయించుకునేది వాస్తవమే కాని అమ్మాయిలతో కాదు, 56 ఏళ్ల ముసలావిడతో, ఈ విషయం నా భార్యకి కూడా తెలుసు, అక్కడ రోజు మసాజ్ చేయించుకొని, అలా చేయించుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి, అక్కడికి కేవలం కథలు రాసుకోవడానికే వెళ్తాను, అందుకే ఒక్కో స్క్రిప్టు 15 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఇక తనతో పాటే డ్రగ్స్ కేసులో ఉన్న ఛార్మీకి క్లీన్ చీట్ ఇచ్చారు పూరి. ఛార్మీ అసలు ఎలాంటి అలవాట్లు లేవు, తానూ దేవత లాంటిది. చాలా కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చింది. ఆమెపై ఆరోపణలు ఆధారాలు లేనివి అంటూ సపోర్ట్ చేసారు. పూరి వెర్షన్ ఇలా ఉంటే ఇటు శ్యాం కె నాయుడు, అటు సుబ్బరాజు .. ఇద్దరు కూడా విచారణలో పూరికి డ్రగ్స్ అలవాటు ఉందని, విదేశాల్లోంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారని సమాధానమిచ్చారు. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, ఛార్మీ .. వీళ్ళంతా పూరి జగన్నాథ్ క్యాంప్ మనుషులే కావడం.