Puri Jagannath is a drug addict – Shayam K Naidu turns approver

టాలివుడ్ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు అయ్యేలా ఉంది. రెండోవరోజే ఊహించని మలుపులు తిరిగింది విచారణ. మొన్న పూరి జగన్నాథ్ కి విచారించిన పోలీసులు, నిన్న కెమెరామెన్ శ్యాం కె నాయుడుని ప్రశ్నించారు. దాదాపు అయిదు గంటల పాటు 30కి పైగా ప్రశ్నలతో జల్లెడ పట్టారు. అంతలోనే నోటి నుంచి ఎవరు ఊహించని విషయాలు బయటపడ్డాయి. పూరి జగన్నాథ్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందట. ఇప్పుడు తీసుకుంటున్నారా లేదా అనే విషయం మీద క్లారిటి లేదు కాని, ఒకప్పుడు మాత్రం పూరి డ్రగ్స్ లో మునిగి తేలారట. కేవలం తానూ తీసుకోవడమే కాకుండా, ఇతరులకి కూడా అలవాటు చేయించారట. పూరి పార్టనర్ చార్మీకి కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందట.

ఈ విషయాలు ఇంకెవరో చెబితే అనుమానం ఉండేది కాని చెప్పింది శ్యాం కె నాయుడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 17 సినిమాలకు ఆయనే కెమెరామెన్. హీరో అయినా దర్శకుడితో ఎప్పుడూ ఉండడు కాని కెమెరామెన్ ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. పూరి డ్రగ్స్ తీసుకుంటుండగా శ్యాం కె నాయుడు చాలాసార్లు తన కళ్ళతో చూసారట. తానూ తీసుకోవడంతో ఆగకుండా, ఇతరులకి అందించేవారట. ఈ రేవ్ పార్టీలు, లేట్ నైట్ పార్టీలు అంటే పూరికి బాగా ఇష్టమని, ఆ పార్టీలకు వచ్చేవారు తన మీద ఇంప్రెషన్ పెంచుకోవాలని డ్రగ్స్ సరఫరా చేసేవారని శ్యాం కె నాయుడు విచారణలో తెలిపారట.