Puri Jagannadh Behind Drugs

టాలీవుడ్‌లో డ్ర‌గ్ ఉదంతం ఇండ‌స్ట్రీతో పాటు టోట‌ల్ తెలుగు మీడియా వ‌ర్గాల్లో ఇప్పుడు పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. డ్ర‌గ్ ముఠాలో కీల‌క నిందితుడు కెల్విన్ చెప్పిన విష‌యాలు ఆధారంగా విచార‌ణ పోలీసుల‌కు దిమ్మ‌తిరిగిపోతోంద‌ట‌. కెల్విన్ చెప్పిన అంశాల ఆధారంగా పోలీసులు మొత్తం 12 మందికి ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. రెండో విడ‌త‌లో మ‌రో 7 గురికి కూడా నోటీసులు జారీ చేస్తామ‌ని పోలీసులు చెపుతున్నార‌ట‌.

ఇక నోటీసులు అందుకున్న వారిలో ప్ర‌ముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, యువ నటులు నవదీప్, తరుణ్, తనీష్, నందు, ముమైత్ ఖాన్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, సుబ్బరాజు, ర‌వితేజ కారు డ్రైవ‌ర్ శ్రీనివాసరావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారంద‌రికి ఓ కామ‌న్ లింకు ఉంది. వాళ్లంతా డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కంపెనీకి చెందిన వారే. చార్మీకి పూరి ప్ర‌స్తుతం ఎలాంటి రిలేష‌న్ ఉందో రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక మ‌మైత్‌ఖాన్ పూరి తీసుకొచ్చిన అమ్మాయే.

ఇక ర‌వితేజ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా, సుబ్బ‌రాజు, కెమేరామెన్ శ్యామ్ కె నాయుడు పూరి టీంలోని వారే. వీరంతా క‌లిసి ఎన్నో సినిమాల‌కు ప‌నిచేశారు. పూరీయే వీళ్ల‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేసిన‌ట్టు కూడా పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది. కెల్విన్ నుంచి డ్ర‌గ్స్ తీసుకునే పూరి చార్మీ, మ‌మైత్‌, సుబ్బ‌రాజుకు ఇచ్చేవాడ‌ట‌.

పూరికి డ్ర‌గ్స్‌కు ఎంత‌లా బానిస అయ్యాడంటే కెల్విన్ ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న‌ప్పుడు అత‌డికి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి మ‌రీ న‌గ‌రానికి ర‌ప్పించుకుని డ్ర‌గ్స్ తీసుకునేవాడ‌ట‌. ఇక రెండో జాబితాలో నోటీసులు అందుకునే వారిలో ఓ ప్ర‌ముఖ నిర్మాత‌, మ‌రో హీరోయిన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.