Producers are literally begging Nayantara

కాలం ఏ మనిషిని ఎక్కడ కూర్చోబెడుతుందో చెప్పలేం. నయనతార విషయాన్నే తీసుకోండి. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉంది, తను హీరోయిన్ ఏంటి అన్నారు. కొన్నాళ్ళకు గ్లామర్ దేవత అన్నారు. నయనతార ఒకప్పుడు గ్లామర్ డాల్ గా కనిపించింది, సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా చేసింది. మరి ఇప్పుడో? ఎంత పెద్ద హీరో అయినా సరే, తను సినిమా చేయాలనుకుంటేనే చేస్తుంది. అలాంటిది షారుఖ్ వచ్చి తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమన్నాడు. ఎవరిని ఏమడుగుతున్నారు అన్నట్లుగా జవాబిచ్చి పంపించేసిందట. సినిమా ప్రమోషన్స్ కి సరిగా రాదు, రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుంది, అయినా సరే, నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతారు.

ఎందుకు అంటే తమిళనాట నయన్ ఫాలోయింగ్ అలాంటిది. “లేడి సూపర్ స్టార్” అనే బిరుదు కూడా ఇచ్చేసారు. థియేటర్ల ముందు నయనతార కటౌట్లు పడుతున్నాయి, సినిమాలకి ఆమె పేరు మీదే ఓపెనింగ్స్ వస్తున్నాయి. మరి ఊరికే అంటారా లేడి సూపర్ స్టార్ అని. ఇప్పుడు ఈ లేడి స్టార్ సంఘమిత్ర నిర్మాతలకి చుక్కలు చూపిస్తోంది.

బాహుబలిని మించిపోయే సినిమా అని, దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ అని తెగ భజన చేసారు. మహేష్ బాబు, విజయ్ లని అడిగితే ఇద్దరు సినిమా చేయమన్నారు. సినిమా ఒప్పుకున్న శృతిహాసన్ కూడా ఈ ప్రాజెక్టు వదిలేసుకుంది. అంత భారి సినిమా అంటున్నట్లే కాని, రాజమౌళి – శంకర్ లాంటి దర్శకులు లేనప్పుడు సినిమా మీద ఎవరికి మాత్రం నమ్మకం పుడుతుంది? దర్శకుడు సుందర్ సి తన అభిమాన నటి హన్సికని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నా, ఆ బొద్దుగుమ్మ ఇలాంటి సినిమాకి ఎట్టా సూట్ అవుద్ది అంటున్నారట నిర్మాతలు.

నయనతార కరెక్టు అని అమె ఇంటికి వెళితే, వేయిట్ చేయించి చేయించి చుక్కలు చూపిస్తోందట నయన్. ఇంకో ముక్కలో చెప్పాలంటే నయనతారని అడుక్కుంటున్నారు అవకాశం కోసం. మరి ఆమె కరుణిస్తుందో లేదో చూడాలి.