పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా.. ఏంది దానయ్య ఇది?     2018-06-16   03:46:39  IST  Raghu V

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల జాబితా తీస్తే ఖచ్చితంగా అందులో దానయ్య పేరు ముందు వరుసలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. బాహుబలి తర్వాత స్థానంను దక్కించుకున్న భరత్‌ అనే నేను చిత్రంతో నిర్మాత దానయ్య భారీ మొత్తంలో లాభాలను దక్కించుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దానయ్య రామ్‌ చరణ్‌తో బోయపాటి దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈయన త్వరలో నిర్మించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం మరో ఎత్తు. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటించబోతున్న అది పెద్ద బ్లాక్‌ బస్టర్‌ మల్టీస్టారర్‌ సినిమాను నిర్మాత దానయ్య నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లతో మల్టీస్టారర్‌ను దానయ్య నిర్మిస్తున్నాడు. ఇలా స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ ఉన్న దానయ్య టాలీవుడ్‌ టాప్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందాన ఇంత గొప్ప నిర్మాత అయిన దానయ్య తన కొడుకును చిన్న దర్శకుడి చేతిలో పెడుతున్నాడు.