పవన్‌ వీరాభిమాని కాంగ్రెస్‌లో.. ఎందుకు?     2018-06-20   22:59:17  IST  Bhanu C

పవన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఏ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ఆయన ఫ్లాప్‌ అయిన సినిమాల కలెక్షన్స్‌ చెప్పకనే చెబుతాయి. పవన్‌ కళ్యాణ్‌కు సాదారణ జనాల్లోనే కాకుండా సినిమా మరియు రాజకీయ రంగంలో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఉంటున్నాడు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ను ఎక్కువ శాతం అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం పవన్‌ను సినిమా పరంగానే అభిమానిస్తాం, రాజకీయంగా ఆయనకు అంత సీన్‌ లేదు అనేస్తున్నారు.

సినిమా పరిశ్రమలో పవన్‌ కళ్యాణ్‌కు అత్యంత పెద్ద అభిమాని ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నిర్మాత బండ్ల గణేష్‌ పేరు ముందు ఉంటుంది. ఈ నిర్మాత పవన్‌తో పలు చిత్రాలు నిర్మించడంతో పాటు, పవన్‌తో చాలా సన్నిహితంగా ఉంటాడు. పవన్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కూడా బండ్ల గణేష్‌ జోక్యం చేసుకునేంతగా సన్నిహిత్యం ఉంది. పవన్‌పై ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించే బండ్ల గణేష్‌ ఆమద్య పవన్‌ జనసేన పార్టీకి జై కొట్టాడు. ఏపీలో పవన్‌ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ధీమాగా చెప్పాడు. ఇలాంటి సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌కు బద్ద శత్రువు పార్టీ అయిన కాంగ్రెస్‌తో బండ్ల కలిసినట్లుగా అనిపిస్తుంది.