పురుషాంగంతో మగాళ్ళు పడే మహా ఇబ్బందులు

శరీరనిర్మాణాన్ని ఆధారంగా చేసుకోని కష్టాలన్ని అమ్మాయిలకే ఉన్నట్లు మాట్లాడేస్తారు జనాలు. ఇక్కడ అమ్మాయిల బాధాల్ని తక్కువ చేయాలని కాదు కాని, అబ్బాయిలకి కూడా తమ జననాంగంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ కష్టాల్ని తేలికగా తీసిపారేయకపోతే చాలు. పురుషాంగంతో అబ్బయిలు పడే కష్టాల్లో కొన్నిటిని గుర్తుచేస్తున్నాం చూడండి.

* పొద్దున్నే, ఇలా రోజు మొదలవుతుండగానే అంగం గట్టిపడటం పెద్ద సమస్య. ఈ సమయంలో ఇలా నేచురల్ గా అంగం గట్టిపడటం తమ చేతుల్లో ఉండదు. కేవలం హార్మోన్ కారణాల వలనే కాకుండా, మూత్రాన్ని బ్లాడర్ లో ఆపేస్తూ కూడా అంగం గట్టిపడుతుంది. కాని, పొరపాటులో ఎవరైనా ఇది చూస్తే ఏం అనుకుంటారో, పొద్దున్నే బాగోతం మొదలైంది అని పొరపడతారో అని అబ్బాయిల భయం.

* ఎముకలు లేని అంగం ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. గట్టిపడిన అంగం చిన్ని పొరపాటుతో కూడా ఫ్రాక్చర్ కావచ్చు. ఆ నరకం మాటల్లో వర్ణించలేనిది.

* మానవ శరీరంలో అత్యంత సున్నితమైన భాగాల్లో వృషణాలు ఖచ్చింతంగా ఉండాల్సిందే. పొరపాటులో వాటి మీద కూర్చున్నా, ఏ చిన్న దెబ్బ తగిలినా నొప్పితో విలవిలలాడిపోవాల్సిందే.

* స్త్రీలలో కామోద్రేకం కలిగితే బయటకి కనబడకుండా ఈజీగా మానేజ్ చేయగలరు. కాని పురుషులు ఇట్టే దొరికిపోతారు. అంగం స్తభించేస్తుంది మరి. ఆ ఇబ్బందికర దృశ్యాలు ఊహించుకోకపోతేనే మంచిది.

* తమకే తెలియకుండా అంగంలో ఒక్కోసారి స్కలనము జరుగుతుంది. పొద్దున్నే ఇది జరగటం వలన దీన్ని మార్నింగ్ గ్లోరి అని అంటారు. దాని అనుభవం కూడా సరిగా కలగదు కాని మరకలతో ఇబ్బందిపడాలి.

* శృంగారం పురుషులకి అతిపెద్ద పరీక్ష. అతివృష్టి లాంటి శీఘ్రస్కలన సమస్యలు, అనావృష్టి లాంటి అంగస్తంభన సమస్యలు .. ఎప్పుడు ఏమవుతుంతో చెప్పలేని పరిస్థితి.

* స్తంభించిన పురుషాంగం సాధారణంగా వంకరగా ఉంటుంది. అందరో ఇలానే ఉన్నా, తమకే ఇలా జరుగుతోందేమి అని మగవారు భయపడే తీరు వారి ఆమాయకత్వానికి నిదర్శనం.

* మంట, టైట్ అండవియర్స్, వేసవి మోసుకొచ్చే దురద..చెప్పుకుంటే ఇంకా చాలానే ఉన్నాయండోయ్.