ఆ దోషంవల్ల పెళ్లి ఆలస్యమవుతుంటే...ఈ ఆలయాని తప్పక దర్శించుకోవాలి.! ఎక్కడ ఉందంటే.?    2018-06-21   01:14:41  IST  Raghu V

వివాహం అనేది ప్రతీమనిషి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం. దాని గురించి పెద్దలు, పెళ్లి చేసుకునే యువతీ యువకులు కూడా ఎన్నో కలలు కంటారు. అయితే కొన్ని కారణాలు వలన కొందరికి వివాహం ఆలశ్యం అవుతుంది. అన్ని సిద్దంగా ఉన్నా కూడా ఎన్ని సంభందాలు చూసినా కూడా సరైన సమయానికి అవకుండా ఏదో ఒక ఆటంకం వస్తుంది. వివాహం వెంటనే జరిగిపోవాలని దేవుళ్లను మొక్కుకుంటారు. త్వరగా పెళ్లి కుదరటం కోసం ఇలా చేస్తే మంచిది.

నాగదోషం ఉండడం వల్ల పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది. అలాంటి వారు తప్పక దర్శించాల్సిన ఆలయం ఒకటి ఉంది. అదే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, మోపిదేవి, కృష్ణా జిల్లా.దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం