Priyanka undergoes yet another surgery on face

ఇండియన్ హీరోయిన్స్ లో, ముఖ్యంగా బాలివుడ్ హీరోయున్స్ లో, సర్జరీ చేయించుకున్న వారి పేర్లు చదవడం కన్నా, చేయించుకోని హీరోయిన్ల పేర్లు చదవడం త్వరగా పూర్తి అవుతుందేమో. ప్రియాంక సర్జరీ చేయించుకుంది, అనుష్క చేయించుకుంది, కత్రీనా చేయించుకుంది, దీపికా చేయించుకుంది .. ఇలా చెప్పుకుంటూపోతే టాప్ హీరోయిన్స్ అంతా తమ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని మార్చుకున్నవారే. ఇందులో అనుష్క శర్మ సర్జరీ ఒక్కటే బెడిసికొట్టింది. డిజైన్ చేయించుకున్న పెదాలు ఆమె మీద నప్పకపోవడంతో, మళ్ళీ తన పాత పెదాల అకారాన్ని మళ్ళీ సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు రెండు సర్జరీల లిస్టులోకి అనుష్కతో పాటు ప్రియాంకతో చేరింది.

ప్రియాంక ఇప్పటికే తన పెదాలకి సర్జరీ చేయించుకుంది. ఈ విషయం బాలివుడ్ మొత్తం తెలుసు. కాని ఓ అమెరికన్ ఛానేల్ వారు ఇంత అందమైన పెదాలు పుట్టకతోనే వచ్చాయా అని అడిగితే ఔను పుట్టుకతోనే ఇలా ఉన్నాయి అంటూ అబద్ధం చెప్పింది. ఇక ఆ హాలివుడ్ జనాలు ప్రియాంక ముక్కుపై ఏవో కామెంట్స్ చేసారట. ప్రియాంకలో అన్ని బాగున్నాయి కాని ముక్కు ఒక్కటే కొంచెం తేడా అన్నారట. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రియాంక. ఇంకేం, మళ్ళీ సర్జరీ చేయించుకుంది. ముక్కు ఆకారాన్ని మార్చుకుంది.

అయితే సర్జరీ తరువాత ప్రియాంక ఇంకా మీడియా ముందుకి రాలేదు. ఆ సర్జరీ సూట్ అయ్యిందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం. సెట్ అయితే ఫర్వాలేదు కాని కత్రీనా చేసుకున్న బొటాక్స్ బెడిసికొట్టినట్టు తేడా కొడితే ప్రియాంక మీద ఇంటర్నెట్ లో కొత్త జోకులు పుట్టుకొస్తాయి.