ఊరికోసం ఆ “ఎన్నారై కుర్రాళ్ళు” అద్భుతం చేశారు..     2018-04-27   06:30:28  IST  Bhanu C

పుట్టిన ఊరిని కన్న తల్లిని విడిచి ఉండలేము..ఎక్కడికి వెళ్ళినా సరే మనసు అటువైపే లాగుతూ ఉంటుంది..జీవనోపాది కోసం ఎంతో మంది అలాంటి ఊళ్ళని విడిచి విదేశాలకి వెళ్తారు కానీ ఎంతో మంది ఊరినీ మర్చిపోతారు కన్న వాళ్ళని వదిలేస్తారు అయితే ఈ ఎన్నారై కుర్రాళ్ళు మాత్రం అలా కాదు తాము పుట్టిన ఊరికోసం మాత్రమె కాదు పక్కనే ఉన్న ఊళ్లకోసం కూడా నడుం బిగించారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు..వివరాలలోకి వెళ్తే..

కడప జిల్లా చిన్నమండెం మండలంలోని మారుమూల గ్రామం చాకిబండకు చెందిన కుర్రాళ్లు గల్ఫ్‌ వేదికగా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు…ప్రవాస సేవా సంఘం పేరిట ఆరునెలలుగా తమ ఊరిజనానికి కొత్త వెలుగులు పంచుతున్నారు. చాకిబండ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు గల్ఫ్‌బాట పట్టారు. వీరిలో కొందరు బాగా డబ్బులు సంపాదించి అక్కడే స్థిరపడ్డారు.అయితే గల్ఫ్‌లో ఉంటున్న ఈ ఊరికి చెందిన కుర్రాళ్లకు ఒక ఆలోచన వచ్చింది.