చంద్రబాబు ఊహించని పరిణామం..వైసీపిలోకి కీలక నేత     2018-05-13   05:19:40  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి ముందు ముందు భారీ షాకులు తగలనున్నాయి అంటున్నారు విశ్లేషకులు..తెలుగుదేశం పార్టీ పై తన సొంత పార్టీ నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వారు కర్ణాటక ఎన్నికల రిజల్స్ తరువాత వెళ్లిపోతారని అంటున్నారు..అయితే ఈ విషయంలో ఒక ఖచ్చితమైన సమాచారం మాత్రం ఉందని తెలుస్తోంది..ఇప్పటికే బీజేపి , వైసీపి నేతలు మే 15 తరువాత కీలకమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో కాస్తో కూస్తో ఉప్పందుకున్న నేతలు మెల్లగా పెట్టె బేడా సర్దుకుంటున్నారు.

ఈకమంలోనే తెలుగుదేశం పార్టీ కి అంతగా పట్టులేని జిల్లా అయిన ప్రకాశం నుంచీ చంద్రబాబు కి భారీ షాక్ ఇవ్వబోతునారట ఒక కీలక నేత..గత ఎన్నికల ముందు పార్టీ లో చేరిన ఓ కీలక నేత ఇప్పుడు పార్టీ ని వీడి వైసీపి లోకి వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారట..అంతేకాదు జగన్ దగ్గర ఒంగోలు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు మాట కూడా తీసుకున్నారని తెలుస్తోంది..ఒంగోలులో మూడుసార్లు ఎంపీగా పని చేసిన అనుభవం ఉండటంతో వైసీపి ఆ నేతకి గేలం వేసిందని దాంతో సదరు నేత టీడీపీ ని వీడి వైసీపిలోకి వెళ్ళారని అంటున్నారు..ఇంతకీ ఆ కీలక నేత ఎవరంటే..