బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.?     2018-06-11   23:38:39  IST  Raghu V

మొత్తానికి బిగ్ బాస్ 2 నాని ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యింది. ఈ సారి ఇంకొంచెం మసాలా అంటూ స్టార్ట్ చేసిన నాని మొదటి రోజు రచ్చ బాగానే క్రియేట్ చేశాడు. 16 మంది పోటీదారులతో 106 రోజుల పాటు ఈ షో సాగనుంది.

కానీ ఈ షో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయం గ్రహించిన నిర్వాహకులు ఇప్పుడు షోని మరింత కలర్ ఫుల్ చేయడానికి ఓ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్ ఈ షోలో భాగం కానుంది. ఈ విధంగానే సీసన్ 1 లో నవదీప్, దీక్ష పంత్ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సీసన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోయే హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.? ముందుగా పలువురు భామలను సంప్రదించి ఫైనల్ గా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. షోలో ఉన్న మిగిలిన వారితో పోలిస్తే ప్రగ్యాకు ఉన్న క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి.

అసలే ఈ మధ్య ట్రెడిషనల్ పద్ధతి నుండి బయటకి వచ్చి గ్లామర్ ఒలకబోస్తోన్న ప్రగ్యా బిగ్ బాస్ హౌస్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది. సినిమాల పరంగా కూడా ప్రస్తుతం ఆమె ఖాళీగా ఉండడంతో ఈ షోలో ఎంట్రీ ఇస్తుందని టాక్. మరి ఈ షో ప్రగ్యాకు ఎలాంటి క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి!