ప్రభాస్‌కు ఎందుకు ఇంత విరక్తిగా ఉంది?     2018-06-22   05:55:48  IST  Raghu V

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ చిత్రం విడుదలై దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది. ఈ ఏడు సంవత్సరాల్లో ప్రభాస్‌ కేవలం ‘బాహుబలి’ రెండు పార్ట్‌లతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి 2 విడుదలై సంవత్సరం గడిచినా కూడా ప్రభాస్‌ తదుపరి చిత్రం రాలేదు. మరో సంవత్సరం అయితే తప్ప ప్రభాస్‌ తదుపరి చిత్రం ‘సాహో’ విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడు సంవత్సరాలుగా సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్‌కు సినిమాలు అంటేనే విరక్తి పుడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘బాహుబలి’ కోసం రాజమౌళి దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపెడితే ప్రస్తుతం ‘సాహో’ కోసం దర్శకుడు సుజీత్‌ చుక్కలు చూపిస్తున్నాడు. భారీ యాక్షన్‌ సీన్స్‌ అని, పెద్ద పెద్ద ఛేజింగ్‌ సీన్స్‌ అంటూ దర్శకుడు సుజీత్‌ వామ్మో అనిపిస్తున్నాడు. కోట్లకు కోట్లు పెట్టి సుజీత్‌ యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్న సమయంలో ఖచ్చితంగా డూప్‌ లేకుంటేనే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రభాస్‌ సొంతంగానే రిస్క్‌ షాట్లు చేస్తున్నాడు. ఇంతగా కష్టపడుతున్న సాహో సినిమా ఇంకా సంవత్సరం అయినా పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఒక జాతీయ మీడియాకు ప్రభాస్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు.