సాహో లో 8 నిమిషాల ఫైట్ కోసం 70 కోట్ల..ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పునకాలే...     2018-06-14   01:13:53  IST  Raghu V

బాహుబలి కి ముందు ప్రభాస్ సినిమా మార్కెట్ 50 కోట్లు , బాహుబలి తరువాత దాదాపు ఏ తెలుగు హీరోలకి దక్కని మార్కెట్ ప్రభాస్ కి ఏర్పడింది , దాదాపు బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 లు కలిపి 1500 కోట్ల పై వసూల్లే వచ్చాయి.బాలీవుడ్ లో కూడా మనోడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ఇప్పుడు బాహుబలినిమించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. బాహుబలి కి ఏమాత్రం తగ్గకుండా సాహో నిర్మాతలు ఈ సినిమా కి డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.

ప్రభాస్ క్రేజ్ ని వాడుకుని బడా నిర్మాతలుగా మారాలనే ప్లాన్ లో యూవీ వారు ఉన్నారా అనిపిస్తుంది సాహో కి సంబందించిన న్యూస్ వింటుంటే. అంతకుముందు యూవీ క్రియేషన్ లో 20 కోట్ల బడ్జెట్ కూడా ఏ సినిమాకి పెట్టలేదు.ఇప్పుడు సాహో కోసం భారీగా బడ్జెట్ పెడుతున్నారు.అందుకే దేశం మొత్తం మీద సాహో మీద క్రేజ్ ఏర్పడేలా చేస్తున్నారు. ప్రభాస్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ ఆధ్వర్యంలో దుబాయ్ లో పూర్తి చేసుకుని సాహో టీమ్ తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టింది.