ప్రభాస్‌ కూడా రంగస్థలం దారిలోనే!     2018-06-25   05:57:19  IST  Raghu V

ఇటీవల తెలుగు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. ఈతరం యువ ప్రేక్షకులకు 1980లలో ఎలా ఉండేది పరిస్థితులు, పల్లెటూర్లలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాలు తెలియవు. పూర్వ కాలంలో పరిస్థితులను వరుసగా స్టార్‌ హీరోలు ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సిద్దం అవుతున్నారు, ఇప్పటికే కొందరు అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకునేలా చేశారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం 1980 నేపథ్యంలో తెరకెక్కి అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టడం జరిగింది. త్వరలో మరికొన్ని చిత్రాలు కూడా కళ్లకు కట్టినట్లుగా అప్పటి పరిస్థితులను చూపించేందుకు రెడీ అవుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ ‘జిల్‌’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతుంది. 1970లలో జరిగే ప్రేమ కథను రాధాకృష్ణ చూపించబోతున్నాడు. అప్పట్లో ప్రేమ కథ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది. యూవీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 1970 నేపథ్యంను చూపించేందుకు దర్శకుడు రాధాకృష్ణ భారీ సెట్టింగ్‌లను వేయిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది.