Prabhas acting instrumental in Baahubali 2 business

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తారల్లోనే కాదు, పంపిణీదారుల్లో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు హీరోగా రాణిస్తున్న సుధీర్ బాబు, నిర్మాతలుగా మారిన యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ పంపిణీ రంగంలో ఉన్నప్పటి నుంచి ప్రభాస్ కి మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే, బాహుబలి 2 చిత్రం యొక్క హక్కులు తనకు బాగా కావాల్సినవారికి దక్కేలా చూసుకుంటున్నాడట ప్రభాస్.
హీరోగారికి కావాల్సిన వారు కదా అని స్పెషల్ డిస్కౌంట్లు ఏమి ఇవ్వట్లేదు కాని, అంత పెద్ద సినిమా హక్కులు కోట్లు చెల్లించి కొనాలన్నా పెద్ద పోటి తప్పదు. అందుకే అంత పోటి వాతావరణంలో కూడా ప్రభాస్ అండదండలతో బాహుబలి నార్త్ అమెరికా, కెనెడా హక్కులను 45 కోట్లు చెల్లించి దక్కించుకుంది గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ. ” బాహుబలి 2 అమెరికా కెనెడాలో హక్కులు మాకు దక్కడం వెనుక ప్రభాస్ గారు చేసిన సహాయం ఎంతో ఉంది” అని గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఓనర్ సుధాకర్ వ్యాఖ్యానించారు.

ఈ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఇంతకుముందు ప్రభాస్ నటించిన మిర్చి చిత్రాన్ని ఓవర్సీస్ లో పంపిణీ చేశారు. అప్పుడే ప్రభాస్ కి ఈ సంస్థ మీద బాగా నమ్మకం ఏర్పడింది. ఇంతే కాదండోయ్ .. వేరే ఏరియాల్లో కూడా ఎవరి చేతిలో పంపిణీ పెడితే బాగుంటుందో రాజమౌళికి, నిర్మాతలకి సూచిస్తున్నాడట మన డార్లింగ్.