శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమి అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు     2018-04-10   22:03:37  IST  Lakshmi P

మనం ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఎన్నో విటమిన్స్,మినరల్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అలాంటి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఈ పొటాషియం అనేది మన శరీరంలో కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ద్రవాలు నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చాలా మందిలో పొటాషియం లోపం వస్తుంది. అసలు పొటాషియం లోపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Potassium Deficiency Symptoms


నీరసం,అలసట ఎక్కువగా తరచుగా అనిపిస్తూ ఉంటే పొటాషియం లోపించిందని గుర్తించాలి. రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనంగా మారి అలసట కలుగుతుంది. ఏ పని చేయాలన్న నిస్సత్తువుగా ఉండి ఆసక్తి అనేది అసలు ఉండదు.