Pornstar Nadia Hilton turned pastor .. reason will melt your hearts

పోర్న్ బాగా చూసేవాళ్ళకి, లేదా పోర్న్ ఇండస్ట్రీ మీద మంచి అవగాహన ఉన్నవారికి నదియా హిల్టన్ అనే పోర్న్ స్టార్ పేరు తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ పోర్న్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగి, కోట్లు గడించిన నాదియా, పోర్న్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి కొంతకాలమైంది. ఆమె పోర్న్ చిత్రాల్లో ఎందుకు కనబడటం లేదు అని ఇన్నేళ్ళుగా ఆమె అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతోంటే, ఆమె నీలి చిత్రాలు చేయడం ఎందుకు మానేసిందో మొత్తానికి తెలిసిపోయింది. విషయం ఏమిటంటే, ఆమె పెళ్ళి చేసుకుంది. అది కూడా ఓ చర్చి ఫాదర్ ని. ఆ చర్చి ఫాదర్ ఆమెని బలవంతంగా పోర్న్ ఇండస్ట్రీ నుంచి బయటకివచ్చేలా చేసాడు అని అనుకునేరు .. అది కాదు జరిగింది. ఆమె పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఓ బలమైన కారణమే ఉంది, ఆమె నీలి చిత్రాలు వదిలేయడానికి కూడా బలమైన కారణమే ఉంది.

నాదియా అసలు పేరు క్రిస్టల్ బస్సేట్టే. ఒకప్పుడు కాలిఫోర్నియాలో ఉండేది. పాపం .. పదహారేళ్ళ వయసులో తన మీద ఎవరో అత్యాచారం చేసారు. దాంతో నాదియా గర్భం దాల్చింది. ఇంట్లో తనని, తన సంతానాన్ని లోనికి రానివ్వకపోవచ్చని భయం. అలాగనే ఆబార్షన్ చేయించుకొని పసిప్రాణాన్ని చంపేయాలని లేదు. ఏం చేయాలో తోచలేదు. మోడలింగ్ చేసుకుంటూ, వచ్చిన దానితో తన కొడుకుని పోషించుకుందాం అనుకోని ఇంట్లోంచి పారిపోయింది. హాలివుడ్ వైపు అడుగులు వేసింది. మోడలింగ్ లో ప్రయత్నాలు చేసింది. ఎందుకో అదృష్టం కలసి రాలేదు. బార్లలో నగ్న నృత్యాలు చేసుకుంటూ తన కొడుకుని పోషించుకుంటూ ఉండగా, ఒక పోర్న్ ఇండస్ట్రీ ఎంజేంట్ ఆమెని కలిసాడు. పోర్న్ చిత్రం చేస్తే డబ్బులు బాగా ఇప్పిస్తానని చెప్పాడు. పిల్లాడి ఆకలి, పెంపకం, చదువు .. ఇన్ని బాధ్యతలు తనపై ఉన్నాయి .. అందుకే ఒప్పుకుంది.

ఏమాత్రం ఇష్టం లేకుండా ఓ పోర్న్ చిత్రం చేసింది. 20 లక్షలు చేతికి వచ్చాయి. కాని నాదియా కంట్లో కన్నీళ్ళు ఆగట్లేదు. బాత్రూంలో గంటలకొద్దీ కూర్చొని ఏడ్చేసింది. ఓ నెలరోజులపాటు మరో నీలి చిత్రం చేయలేకపోయింది. కాని తనకంటూ ఓ ఇల్లు, తన పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉండాలంటే తను కష్టపడాల్సిందే .. అందుకే మళ్ళీ పోర్న్ చిత్రాలు మొదలుపెట్టింది. తనకి ఈ పనులు ఇష్టం లేవు. స్పర్శ సరిగా తెలియకూడదని ఒక్కోసారి మద్యం తాగేదట, మందులు వాడేదట. తన వయసులో ఎలా ఉండాల్సింది .. ఎలా ఉంటున్నాను అంటూ రోజు ఏడ్చేది.

మెల్లిగా నాదియా స్టేటస్ మారిపోయింది. పోర్న్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయిపొయింది. కోట్లు సంపాదించింది. ఆఫర్లు వస్తున్నాయి .. తన స్టార్ డం పెరిగిపోతోంది .. పెద్ద ఇల్లు, కార్లు, అన్ని వసతులు .. నాదియా ఇటు పోర్న్ కి, అటు డబ్బుకి అలవాటు పడిపోయింది. ఎదో ఒక రోజు ఇదంతా ఆపేయాలని తెలుసు .. కానీ ఎప్పుడో తెలియదు. ఇంతలో నాదియా జీవితంలో మరో సంఘటన జరిగింది. పెద్ద యాక్సిడెంట్, మరణం అంచుల దాకా వెళ్ళింది నాదియా. కాని బతికిపోయింది. ఇదో పునర్జన్మలా అనిపించింది ఆమెకి. దేవుడిచ్చిన తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంది.

తన జీవితానికి ఒక తోడు కావాలి, కుటుంబం కావాలి అనుకుంది. కాని తన గతాన్ని స్వీకరించేది ఎవరు ? ఓ చర్చి ఫాదర్ ముందుకొచ్చాడు. ఆమెని స్వీకరించాడు. ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు. వీరికి సంతానం కుడా ఉంది. ఇద్దరు కలిసి ఓ చర్చి నిర్మించారు. ఇప్పుడు అదే చర్చిలో మతబోధనలు చేస్తూ తన సమయాన్ని గడిపేస్తోంది నాదియా. తన తల్లిదండ్రులని కూడా కలుసుకుంది. మంచి భర్త, కొడుకులు, తల్లిదండ్రులు .. ఇప్పుడు తన జీవితం సంపూర్ణం.