Popular Homemade Fruit Packs For Glowing Skin

చర్మంలో విషాలను బయటకు పంపి ప్రకాశవంతంగా మార్చటానికి పండ్లు సహాయపడతాయి.రసాయనక చికిత్సలు కాకుండా సీజన్ కి తగ్గట్టుగా దొరికే పండ్లతో చర్మాన్ని మెరిపించవచ్చు. ఆ పండ్ల గుజ్జులో కొన్ని పదార్దాలను కలిపి ఉపయోగిస్తే చాలు. అవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1. అరటిపండు – పోషణ :

ఇది పొడి చర్మం వారికీ చాలా బాగా సెట్ అవుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానిలో పాలు కలిపి మందపాటి పేస్ట్ గా చేయాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం,అరస్పూన్ కాలామైన్ పౌడర్ కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. ఆరెంజ్ – శక్తి :

ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే లాభాన్ని చర్మానికి ఇస్తుంది. ఇది చర్మం కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక స్పూన్ తాజా పాల మీగడ,ఒక స్పూన్ ముల్టానా మట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాల మీగడ చర్మంలో పొడిదనంను తగ్గిస్తుంది.