ఆ దర్శకుడు ఎవడో కాని మామూలోడు కాదు     2018-05-11   01:58:31  IST  Raghu V

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఈమద్య ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కాస్టింగ్‌ కౌచ్‌ సినిమా పరిశ్రమలో ఉందని అంతా అంటున్న మాట. కాని ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆ విషయమై నోరు ఎత్త లేదు. ఇటీవల కొందరు ఆ విషయమై విమర్శలు చేస్తూ తమ గళం ఎత్తుతున్నారు. వారిలో శ్రీరెడ్డి ప్రథమంగా ఉంది. ఆమె కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో వణుకు మొదలు అయ్యింది. గతంలో కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడ్డ వారు కూడా ఇప్పుడు ఏమవుతుందో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు.

తాజాగా హీరోయిన్‌ పూనం కౌర్‌ ఒక దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన సినిమాలను దర్శకత్వం చేయడంతో పాటు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన అమ్మాయిలను డైరెక్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆయన డైరెక్షన్‌లో అమ్మాయిలు చెప్పింది చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వారు ఇండస్ట్రీలో నాలుగు రోజుల పాటు ఉంటారు. అదే ఆయనకు ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో నిలవడమే కష్టం. అసలు గుర్తింపు రాకుండా చేయడంలో ఆయన సిద్ద హస్తుడు అంటూ చెప్పుకొచ్చింది.