చికాగో సెక్స్‌ రాకెట్‌.. కిషన్‌, చంద్రల గురించి షాకింగ్‌ విషయం     2018-06-29   02:58:19  IST  Raghu V

అమెరికాలో తెలుగు సినీ తారలు, బుల్లి తెర తారలు వ్యభిచారం చేస్తున్నట్లుగా అక్కడ పోలీసులు గుర్తించారు. వారితో కిషన్‌ మరియు ఆయన భార్య చంద్రకళలు డబ్బు ఇచ్చి ఒప్పించి లేదంటే బలవంతంగా వ్యవభిచారం చేయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడైంది. చాలా సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో అక్కడ పోలీసులు లోతుగా అద్యయం చేస్తున్నారు. ఇన్నాళ్లు కిషన్‌, చంద్రలు పెద్ద మనుషుల ముసుగులో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయి. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల పేరుతో వారు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావని వెళ్లడైంది.

తెలుగు సంఘాల పేర్లతో ఏదో ఒక కార్యక్రమం ఉందంటూ తెలుగు సినీ తారలను పిలిపించుకుని, అక్కడ వారితో బలవంతంగా వ్యవభిచారం చేయించడంతో పాటు, వారిని శారీరకంగా మరియు మానసికంగా చిత్రవదలు చేయడం చేశారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్‌, ఎంతో మంది బుల్లి తెర స్టార్స్‌ కూడా వీరికి బలి అయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే అందులో ఒక్కరు ఇద్దరు మినహా ఎవరు కూడా బయటకు రావడం లేదు. అయినా కూడా కిషన్‌ రాసుకున్న డైరీతో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.